మందమర్రి (విజయక్రాంతి): సదా సేవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని ఒకటో జోన్ శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక మండపం ఆవరణలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత నేత్ర వైద్య శిబిరంకు హాజరైన వారికి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించడంతో పాటు పలువురికి కళ్ళ జోళ్ళు అందచేశారు. ఈ సందర్బంగా సదా సేవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగి సంతోష్ మాట్లాడారు. నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు వైద్యం బారం కాకూడదనే సదాశయంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో నాలుగు వైద్య శిబిరాలు నిర్వహించి వందలాది మంది నిరుపేదలకు నేత్ర వైద్యం అందించడం జరిగిందన్నారు. ఉచిత నేత్ర చికిత్సకు ముందుకు వచ్చిన వైద్యుడుని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు యాకుబ్, జనార్దన్ లు పాల్గొన్నారు.