calender_icon.png 12 April, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్ర వైద్య శిబిరం

04-04-2025 09:32:21 PM

పిట్లం,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.ఆప్తాల్మిక్ అధికారి హరికిషన్ మాట్లాడుతూ, కంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు అందజేశామని తెలిపారు. అలాగే కంటి ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందించుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించి కంటి చూపును రక్షించుకోవాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలు సమర్థంగా వినియోగించుకోవాలని,తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని హరికిషన్ వివరించారు.