- మంత్రి కొండా సురేఖ వెల్లడి
- కలెక్టర్‌తో కలిసి ఆసుపత్రి పరిశీలన
- విధులకు హాజరుకాని సిబ్బందిపై అసహనం
హనుమకొండ, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఐ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సోమవారం వరంగల్ నగరంలోని ప్రభుత్వ కంటి ఆసుపత్రిని కలెక్టర్ సత్యశారదాతో కలిసి ఆమె తనిఖీ చేశారు. వైద్య సేవలపై ఎలాంటి ఇబ్బందులున్నా అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫార్మసీ స్టాక్ గదిలో ఔషధ వివరాలు పరిశీలించా రు. మంత్రి తనిఖీ చేసిన సమయంలో డాక్ట ర్, ఇద్దరు సిబ్బంది లేకపోవడంతో అసహ నం వ్యక్తం చేశారు. విధుల్లో లేని వారికి షో కాజ్ నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆసుపత్రిలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని, వారానికి ఒకసారి కలెక్టర్ ఆ బాక్స్‌లో అంది న ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నారు.