గోదావరిఖని ఏసీపీ రమేష్...
పెద్దపల్లి (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవువని సంవత్సర వేడుకల సందర్భంగా గోదావరిఖని సబ్ డివిజన్ ప్రజలను గోదావరిఖని ఏసిపి మడత రమేష్ ఓ పత్రిక ప్రకటనలో హెచ్చరికలు చేశారు. గోదావరిఖని సబ్ డివిజన్ ప్రదేశాలలో డి.జె.లు, ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సౌండ్ సిస్టంను వినియోగించరాదని, మద్యం సేవించి రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, త్రిబుల్ డ్రైవింగ్ చేస్తూ వాహనములు నడుపరాదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, 31వ తేదీన రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరుగుతూ గుంపులు గుంపులుగా చేరి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు, గొడవలకు, బెదిరింపులకు పాల్పడరాదన్నారు. హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
డిసెంబర్ 31వ తేదీన సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో పెట్రోలింగ్, విసబుల్ పోలిసింగ్, వాహనాల తనిఖీలు, స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ముమ్మరంగా ఉంటుందని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం, ద్విచక్ర వాహనాలకు సైలేన్సర్ తీసేసి అధిక శబ్దాలతో హోరెత్తించడటం, బాణాసంచా పేల్చడం వంటి వాటి వలన ప్రశాంతతకు భంగం కలిగి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, కావున ఇలాంటి వాటికి పాల్పడితే తగిన చర్యలు తీసుకొనబడున్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్ కు పాల్పడినా చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోబడునని, తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసినదిగా గోదావరిఖని ఏసీపీ హెచ్చరించారు.