calender_icon.png 7 November, 2024 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్చరిక.. కాసేపట్లో హైదరాబాద్‌లో భారీ వర్షం

19-07-2024 09:51:33 AM

హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర అప్పపీడనం ప్రభావంతో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోనూ శుక్రవారం భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నేడు ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కురువనున్నాయి. దీంతో ఈ జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అటు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నేడు భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలో జోరుగా వానలు కురువనున్నట్లు సమాచారం. నేడు పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, గుజరాత్‌లోని పలు ప్రాంతాలు , కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.