calender_icon.png 1 March, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అడ్డుకోవాలి

01-03-2025 12:08:12 PM

- జీ స్కూల్ లో ఫీజుల పెంపును 

నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన 

- హయత్ నగర్ లోని జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ 

ఎల్బీనగర్,: కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అడ్డుకోవాలని, జీ స్కూల్ లో ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు జీ స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టి, హయత్ నగర్ లోని జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ... జీ స్కూల్ యాజమాన్యం వచ్చే ఏడాది ఫీజును ఏకంగా 30 శాతం పెంచారని తెలిపారు. గతంలో ఆందోళన చేసినా జీ స్కూల్ యాజమాన్యం స్పందించలేదని వాపోయారు. ఫీజులు తగ్గించాలని, ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తున్న స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.