calender_icon.png 6 February, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ వలసలపై రాజ్యసభలో ప్రకటన

06-02-2025 04:10:03 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): అక్రమ వలసలపై విదేశాంగమంత్రి జైశంకర్(External Affairs Minister Jaishankar) రాజ్యసభ(Rajya Sabha)లో ప్రకటన చేశారు. న్యూఢిల్లీ: అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించడం కొత్త పరిణామం కాదని, చాలా సంవత్సరాలుగా జరుగుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో అన్నారు. వాషింగ్టన్, డిసి బహిష్కరించబడిన వారి పట్ల వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంవత్సరం వందలాది మంది భారతీయులు ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించడం లేదా బస చేయడం వల్ల బహిష్కరించబడుతున్నారని ఆయన ఎత్తి చూపారు. 2009 నుంచి బహిష్కరణలు జరుగుతున్నాయని, 2012లో 530, 2019లో 2,000 కంటే ఎక్కువ ఉందన్నారు. బహిష్కరణకు గురైనవారి కష్టాలను వివరించారు. 

బహిష్కరణ సమయంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని, అక్రమ వలసలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు తేలితే వారిని తిరిగి తీసుకోవడం అన్ని దేశాల బాధ్యత అన్నారు. అని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించేస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తదేమి కాదని, ఏళ్ల నుంచి జరుగుతోందని, ఇది ఒక దేశానికి మాత్రమే వర్తించే విధానం కాదన్నారు.  బహిష్కరణకు గురైన వారి పట్ల దుర్వినియోగం జరగకుండా తాము అమెరికాతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.