calender_icon.png 23 February, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీసరగుట్టపై విస్తృత ఏర్పాట్లు చేయాలి

19-02-2025 12:42:50 AM

అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి 

మేడ్చల్, ఫిబ్రవరి 18(విజయ క్రాంతి): బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 24వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆలయంలోని కార్యాలయంలో ఆలయ ఛైర్మన్ నారాయణ శర్మ, ఆలయఈఓ సుధాకర్  రెడ్డి, జిల్లా అధికారులు, ఆలయ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ  బ్రహ్మోత్సవాలకు వచ్చేసే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా  ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. అధికారులందరు సమన్వయంతో పనిచేసి భక్తులకు సౌకర్యం కల్పించాలని సూచించారు. మహాశివరాత్రితో పాటు అంతకు ముందు, తర్వాత రోజుల్లో సైతం భక్తులు ఎక్కువగానే వస్తారని దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది సైతం ఎక్కువ మందికి స్వామి వారి దర్శనం కలిగేలా చూడాల్సిందిగా  సూచించారు. 

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ ప్రత్యేక బస్సులు  ఏర్పాటు చేయాలని, అదే విధంగా వృద్దులకు, దివ్యాంగుల కోసం ఆటోలను అందుబాటులో ఉంచాల న్నారు. భద్రతా లోపం తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. 

బ్యారీకేడ్,  దర్శనం క్యూ లైన్, పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయని అందుకు జాతరలో  భక్తులకు అందుబాటులో అవసరమైన అన్ని చోట్ల  త్రాగునీటిని అందుబాటులో ఉం చాలని వాటర్ వరక్స్ వారికీ తెలిపారు.  కీసర గుట్ట బ్రహ్మోత్సవాల జాతరలో పూజ సామాగ్రి  ఆహార పదార్థాల నుంచి మొదలుకొని అన్ని రకాల వస్తువుల విక్రయానికి సంబంధించి ధరలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎక్కువ ధరలకు విక్రయించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులు వ్యాపారులకు తెలపాలన్నారు. 

ఈ సందర్భంగా కీసర ఆలయంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు, సమస్యలు  ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని ఆలయ ఈవో,  ఛైర్మన్‌కు  తెలిపారు. మహాశివరాత్రికి కీసరగుట్ట లో శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ను అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్  సమావేశంలో స్పష్టం చేశారు.

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్బుసైట్నుఅదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, పోలీసు, విద్యా, వైద్య, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, ట్రాఫిక్, సమాచార, మత్స్య, ఫైర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.