calender_icon.png 21 January, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు

21-01-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

టేక్మాల్(మెదక్), జనవరి 20 : టేక్మాల్ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, రూపొందించిన వివరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. 

వ్యవసాయ యోగ్యం గాని భూములను  సందర్శించిన కలెక్టర్,  ఆహార భద్రత (రేషన్) కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వివరాలతో కూడిన రిజిస్టర్లను తనిఖీ చేసి, గ్రామ సభల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహణ సమాచారం ప్రజలకు తెలిసేలా టామ్ టామ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.

16వ తేదీ నుండి 20 వ తేదీ వరకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ యోగ్యమైన, వ్యవసాయం చేయని భూముల సమగ్ర సమాచారం సేకరణ చేశారని తెలిపారు.  అట్టి జాబితాను గ్రామసభల్లో లబ్ధిదారుల జాభితా  చదివి వినిపించి తుది జాభితా తయారు చేయనున్నట్లు తెలిపారు. 

నేటినుంచి అజ్జత్ ఖమ షా వలి రహమతుల్లా ఉరుసు ఉత్సవాలు 

మునిపల్లి జనవరి 20: మండలంలోని ఖమ్మం పల్లి గ్రామ శివారులో గల హజ్రత్ ఖమ షా వలి ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాకులు తెలిపారు. ఈ ఉర్సు ఉత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ ఉర్సు ఉత్సవాలకు మండలంలోని ఆయా గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు.