calender_icon.png 18 March, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఎసిఎస్ పాలకవర్గ పదవీకాలం పొడగింపు

17-03-2025 06:24:42 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయంలో సోమవారం నాడు సహకార సంఘం చైర్మన్ నరసింహులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు పిఎసిఎస్ డైరెక్టర్ గోపికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పదవి కాలం ముగిసిన అనంతరం మరో 6 నెలలు పొడిగించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు.

మాపై నమ్మకంతో మరో 6 నెలలో పాటు పదవి కాలం పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక శాసనసభ్యులు మదన్మోహన్రావుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశంతో రైతులకు మరింత సేవ చేసుకునే అదృష్టం కలిగిందన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి బాధ్యతలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.