calender_icon.png 21 February, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార సంఘాల పదవీకాలం 6 నెలలు పొడిగింపు హర్షనీయం

15-02-2025 02:24:44 PM

మంత్రి ఉత్తమ్, మంత్రి తుమ్మల, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు

కృతజ్ఞతలు తెలిపిన కోదాడ పిఎసిఎస్ చైర్మన్లు

కోదాడ, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో 74 ను జారీ చేసింది. పిఎసిఎస్ సంఘాల పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పిఎసిఎస్ పాలకవర్గాన్ని ఆరు నెలలు పొడిగించినందుకు కోదాడ నియోజకవర్గం లో ఉన్న పిఎసిఎస్ చైర్మన్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా  పలువురు చైర్మన్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆరు నెలలు పొడిగించడం అభినందనీయమని అన్నారు. నల్గొండ డిసిసిబి సహకారాలతో సహకార సంఘాలను అభివృద్ధి పదంలో నడిపిస్తామని కోదాడ నియోజకవర్గం పిఎసిఎస్ చైర్మన్లు తెలిపారు. సంఘం సభ్యుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ కొండ సైదయ్య,కాపుగల్లు చైర్మన్ నంబూరి సూర్యం, ఎర్రవరం చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, అనంతగిరి చైర్మన్ డేగ బాబు, కోదాడ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, చిమిర్యాల చైర్మన్ కొత్త రఘుపతి, చిలుకూరు చైర్మన్ జనార్ధన్, నడిగూడెం చైర్మన్ కొల్లు రామారావు, బేతవోలు చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.