19-03-2025 12:49:38 AM
చర్లపల్లి మీదుగా వికారాబాద్ రైలు..
హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ మీదుగా వెళ్లే 8 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీ ఆది, సోమవారాల్లో నడిచే తిరుపతి రైలు ఇకపై సికింద్రాబాద్ నుంచి కాకుండా చర్లపల్లి మీదుగా వెళ్లనుందని ద.మ.రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ స్పష్టం చేశారు. ఆదివారం నడిచే తిరుపతి (నెం. 07481) రైలును ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు, సోమవారం నడిచే వికారాబాద్ తిరుపతి (07482 ) రైలును ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
ఈ రైలు సనత్‌నగర్, అమ్ముగూడ మీదుగా చర్లపల్లి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలోనూ సికింద్రాబాద్ రాకుండా చర్లపల్లి, అమ్ముగూడ మీదుగా వికారాబాద్ చేరుకుంటుందని తెలిపారు. మిగతా రైళ్ల విషయానికి వస్తే తిరుపతి అకోలా (నెం. 07605) రైలు ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు, అకోలా తిరుపతి (07606) రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు, పూర్ణ (నెం. 07609) రైలు ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు, తిరుపతి పూర్ణ (07610) రైలును ఏప్రిల్ 8 నుంచి జులై ఒకటి వరకు నడిపించనున్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో నడిచే కాకినాడ టౌన్‌న (నెం.07445) రైలు ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు.. మంగళ, గురు, శనివారాల్లో నడిచే లింగంపల్లి టౌన్ (07446) రైలు ఏప్రిల్ 3 నుంచి జులై ఒకటి వరకు నడవనున్నాయి.