calender_icon.png 10 January, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2030 వరకు సింగరేణి మైనింగ్ లీజ్ పొడగింపు

03-11-2024 02:17:24 AM

ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి

హైదరాబాద్, నవంబర్ 02 (విజయక్రాంతి): సింగరేణి  సంస్థ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు ప్రాంతంలో చేపడుతున్న తవ్వకాని కి సంబంధించిన గడువును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మైనింగ్ లీజ్ గడువును 2030 డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచింది.

ఈ మేరకు శనివారం ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తు తం తాజా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఖమ్మం జిల్లాలోని రొంపేడు, సుడిమల్లా, ఉసిరికాయలపల్లి గ్రామాల పరిధిలోని తవ్వకాలకు వర్తించనున్నట్టు పేర్కొన్నారు. తదుప రి చర్యలు తీసుకోవాలని  గనులు, జియాలజీ శాఖ డైరెక్టర్‌కు సూచించారు.