calender_icon.png 17 January, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

26-07-2024 03:33:55 AM

  1. విచారణకు మరింత సమయం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరిన సీబీఐ
  2. సిసోడియా, కవిత కస్టడీ కూడా పొడిగింపు

న్యూ ఢిల్లీ, జూలై 25: లిక్కర్ స్కాం కేసులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలో అరెస్టు ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు 8వ తేదీ వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి కేజ్రీవాల్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని సీబీఐ తరఫున లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది. అలాగే ఇదే కేసులో అరెస్టు జుడీషియల్ కస్టడీలో ఉన్న ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కవిత కస్టడీని కూడా ఈనెల 31వరకు పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కాగా కేజ్రీవాల్‌ను ఈ యేడాది మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మే10న మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన తిరిగి జూన్ 2న తీహార్ జైలులో సరెండర్ అయ్యారు.