హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): దోస్త్ ప్రత్యేక విడుత సీట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్ గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఈనెల 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. 7న ప్రత్యేక విడుత సీట్లను కేటాయించనున్నారు. 9వ తేదీ వరకు సీటు పొందిన కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.