calender_icon.png 16 November, 2024 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంహెచ్‌ఎం కోర్సు దరఖాస్తుకు గడువు పెంపు

09-09-2024 03:52:24 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): నిమ్స్ ఆసుపత్రిలో అందించే మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఎం) కోర్సు ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈనెల 16 వరకు గడువు పొడగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన అప్లికేషన్ హార్డ్ కాపీని ఈనెల 18 వరకు హాస్పిటల్‌లో అందించవచ్చని సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, లైసన్ ఆఫీసర్ డా.మార్త రమేశ్ పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి 30 ఏండ్ల లోపు వయసు ఉండి, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారిక ప్రభుత్వ, కార్పొరెట్ ఆసుపత్రులతో పాటు ఫార్మా, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అర్హులకు ఫీజు రీయెంబర్స్‌మెంట్ సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 9న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు పాటిస్తూ అడ్మిషన్లు ఇస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు నిమ్స్ వెబ్‌సైట్ www.nims.edu.in ను సందర్శించాలని కోరారు.