మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో నిర్వహించి పదవి విరమణ పొందిన ఉద్యోగుల వైద్య సౌకర్యం కోసం ఇస్తున్న మెడికల్ కార్డు CPRMS,(N.E) (కంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెంట్ మెడికల్ స్కీం), (నాన్ ఎగ్జిక్యూటివ్) దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 వరకు గడువు పొడిగించిందని ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ తెలిపారు. సింగరేణి యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఇంతవరకు మెడికల్ కార్డు పొందని/రిటైర్ అయిన, అర్హత కలిగిన ఉద్యోగులు 60 వేల రూపాయల కంట్రిబ్యూషన్ తో ఈ పథకంలో చేరవచ్చనీ మెడికల్ కార్డు పొందుటకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని కోరారు. ఈ స్కీములో సభ్యులుగా ఉన్నవారు లైవ్ సర్టిఫికెట్ సమర్పించుటకు ప్రస్తుతం ఉన్న పద్ధతులతో పాటు ఈమెయిల్ ద్వారా పంపించవచ్చని సూచించారు.