హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ల కోసం భర్తీ చేసే వైర్‌మెన్, సూపర్వైజర్ పరీక్షల అప్లికేషన్ గడువును పొడిగించాలని సాంకేతిక విద్య శిక్షణామండలి కార్యదర్శి ఏ పుల్లయ్యకు బుధవారం తెలం గాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. సెప్టెంబర్ 17న అప్లికేషన్‌కు చివరి తేదీ కాగా నిమజ్జనం కారణంగా చాలా మంది దరఖాస్తు చేయలేదని అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా యాదగిరి తెలిపారు. సానుకూలంగా స్పందించిన కార్యదర్శి పుల్ల య్య దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించా రు. వైర్‌మెన్, సూపర్వైజర్ పోస్టుల కు పరీక్షలు రాసే అభ్యర్థులకు ఈనెల 23 నుంచి వారంపాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తామని నక్కా యాదగిరి తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7989349899 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.