వెనిజువెలా, ఆగస్టు 9: వెనిజువెలాలో 10 రోజుల పాటు ఎక్స్ (ట్విట్ట ర్) సేవలను నిలిపివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురో ప్రకటించారు. దేశంలో ఎన్నికల అనంతరం హింస చెలరేగుతోందని, సోషల్ మీడి యా కారణంగా దేశంలో అశాంతి, అంతర్యుద్ధం పెట్రేగిపోతోందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాట్సప్‌ను సైతం వాడొద్దని మడురో తన మద్దతుదారులను కోరారని, దీనివల్ల సైనికులు, పోలీస్ ఉన్నతాధికా రుల సమాచారం తీసుకుని వారి కుటుంబాలపై దాడులకు పాల్పడే అవకాశముందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే మడురో వ్యాఖ్యలను వాట్సప్ యాజమాన్యం ఖండించింది.