04-03-2025 12:28:51 AM
వైడి రెడ్డిమల్ల ఫౌండేషన్, యంగ్‌స్టార్ యూత్ వినతి
ఖానాపూర్, మార్చి 3 (విజయక్రాంతి) ః నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి, రాజధాని హైదరాబాద్ కు గతంలో మాదిరి ఎక్స్ప్రెస్ సర్వీస్ లను ఆర్టీసీ పునరుద్ధరించాలని ,వైడి రెడ్డిమల్ల ఫౌండేషన్ ,ఫౌండర్ చైర్మన్ ఏసుదాస్ రెడ్డిమల్ల, యంగ్ స్టార్ యూత్ ఖానాపూర్ అధ్యక్షులు షేక్ షకీల్, మిషన్ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ నేత్ర వైద్య సహాయకురాలు డాక్టర్ చిత్రలత రెడ్డి మల్ల లు, సోమవారం స్థానిక తాసిల్దార్ సుజాత రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ మేరకు గతంలో, కడం, ఖానాపూర్, నుంచి ఎక్స్ప్రెస్ సర్వీస్ లు ఉండగా, ఇటీవల వాటిని రద్దుచేసి, డీలక్స్ సర్వీస్ లను వేయడంతో, రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్సు సేవలు, ఖానాపూర్ నియోజకవర్గ మహిళలు, ప్రజలకు అందకుండా పోయాయని, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి, హైదరాబాద్ రాజధానికి, అనేకమంది విద్యా, వ్యాపారం, వైద్యం, వంటి అవసరాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని, రాజధానితో ఇక్కడి ప్రజలకు సంబంధం బాంధవ్యాలు ఉండడంతో, ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్సు సౌకర్యం అనుకూలంగా ఉంటుందని, అధికారులు, నాయకులు, స్పందించి ,ఈ సర్వీసులను గతంలో మాదిరి ఉదయం 5 గంటలకు ,రాత్రి 9:30 కు, తిరిగి రాత్రి హైదరాబాద్ నుంచి పది పావుకు పునరుద్ధరించాలని, వారు కోరారు.దీంతో ప్రజలపై ఆర్థిక బారం తగ్గించి నట్లు అవుతుంది అని అన్నారు.