న్యూఢిల్లీ, నవంబర్ 14: ఈ ఏడా ది అక్టోబర్ నెలలో దేశం నుంచి వస్తూత్పత్తుల ఎగుమతులు 17.5 శాతం పెరిగి 39.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ స్థాయిలో ఒక నెలలో ఎగుమతులు పెరగడం గత రెండేండ్లలో ఇదే ప్రధమం. గురువారం కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో దిగుమతులు 3.9 శాతం పెరిగి 66.34 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో వాణిజ్యలోటు 39.2 బిలియన్ డాలర్లకు ఎగిసింది.