calender_icon.png 29 September, 2024 | 5:44 AM

పారాబాయిల్డ్‌పై ఎగుమతి పన్ను కోత

29-09-2024 01:39:35 AM

20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దేశంలో పారాబాయిల్డ్ బియ్యం నిల్వలు పేరుకుపోవటంతో వాటిని ఎగుమతి చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్రస్తుతం పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతిపై సుంకం 20 శాతం ఉండగా, దానిని 10 శాతానికి తగ్గిస్తూ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది.

ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. గత సీజన్‌లో సేకరించిన పారాబాయిల్డ్ బియ్యం దేశంలోని గోదాముల్లో పేరుకుపోయాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి మళ్లీ సేకరణ మొదలవుతుంది. ఆ లోపు గోదాములను ఖాళీ చేసే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.