30-01-2025 12:00:00 AM
ఇటీవలి రిపబ్లిక్ దినోత్సవం నాడు హైదరాబాద్, హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటుచేసిన భారతమాత మహా హారతిలో భాగంగా పడవల్లో నిర్వహించిన బాణసంచా పేలుడులో ప్రమాదం చోటుచేసుకోవడం విషాదకరం. కాలిన గాయాలతో ఒకరు, నీట మునిగి ఒకరు చనిపోవటం అత్యంత బాధాకరం. ఇది అక్కడి భద్రతా వైఫల్యాన్ని బయటపెడుతున్నది. నీటిలో రెండు పడవలపై బాణసంచా కాల్చటం తప్పుడు పని. ఎటువంటి రక్షణ లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు.
కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్