* ఇద్దరు జవాన్లు మృతి.. మరో జవాన్‌కు గాయాలు
* బికనీర్‌లో ఘటన
జైపూర్, డిసెంబర్ 18: మందుగుండు పదార్థం లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించి ఇద్దరు జవాన్లు మృతిచెందారు. మరో జవాన్ గాయపడ్డాడు. ఈ ఘటన బికనీర్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ శిక్షణా కేంద్రం లో చోటుచేసుకున్నది. ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ అమిత్‌సాబ్ వివరాలు వెల్లడించారు. అశుతోశ్ మిశ్రా, జితేంద్రతో పాటు మరో జవాను ఫైరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. టోయింగ్ ట్యాంక్‌లో మందు గుండు పదార్థం లోడ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు పేలుడు సంభించింది. ఘటనలో అశుతోశ్ మిశ్రా, జితేంద్ర తీవ్రగాయాల పాలై మృతిచెందారు. గాయపడిన మరో జవా నును తోటి జవాన్లు క్షతగాత్రులను హెలికాఫ్టర్‌లో చంఢీగఢ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇదే శిక్షణ కే్ంర దంలో ఆదివారం గన్ మిస్‌ఫైర్ అయి చంద్రప్రకాశ్ పటేల్ అనే జవా న్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వరుసగా ఘటనలపై జవాన్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది.