ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘటన
అమరావతి, జనవరి 2: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా పెన్నేపల్లి ఉక్కు కర్మాగారంలో బుధవారం రాత్రి పేలు డు సంభవించింది. ప్రమాదంతో ఆరుగురు కార్మికులు గాయాలపాలయ్యారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎంఎస్ అగర్వాల్ కర్మాగారంలోని బాయిలర్ పెద్ద శబ్దంతో పేలింది. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో ఆరుగురు కాంట్రాక్ట్ కార్మికులు గాయా ల పాలయ్యారు. క్షతగాత్రులను తోటి కార్మికులు నెల్లూరు, నాయుడుపేట ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. యాజమాన్యం వెంటనే కర్మాగారం రోజువారీ పనులను నిలిపివేసింది. ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపడుతున్నది.