03-03-2025 11:58:23 AM
అమరావతి: కాకినాడలోని బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో(Balaji Exports) సోమవారం జరిగిన పేలుడులో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో ఒక పార్శిల్‌ను దించుతుండగా ఈ సంఘటన జరిగింది. పేలుడు తీవ్రతకు పెద్ద శబ్దం వినిపించడంతో కార్మికులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) కు తరలించారు. పేలుడుకు గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.