25 మంది మృతి మరో 45 మందికి గాయాలు
క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఘటన
కరాచీ, నవంబర్ 9: పాక్ మరోసారి నెత్తురోడింది. బలూచిస్థాన్ క్వెట్టా రైల్వే స్టేషన్‌లో దుండగులు బాంబును పేల్చారు. ఈ ఘటనలో 25 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా మరో 46 మంది గా యాలపాలయ్యారు. బాధితుల్లో సైనికులు కూడా ఉన్నారు. బాంబ్ బ్లాస్ట్ దృశ్యాలు సీసీటీవీ పుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పేలుడు తీవ్రతకు మృతుల శరీరాలు ప్లాట్‌ఫాం మీద చెల్లా చెదురుగా పడ్డాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ టార్గెట్‌గా దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.