స్వీపర్‌కు గాయాలు
ఎల్బీనగర్, డిసెంబర్ 6: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం పేలుడు సంభవించి, స్వీపర్‌కు గాయాలయ్యాయి. సీఐ నాగరాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుక్రవారం స్వీపర్ సూర్యకళ తొలగించి, నిప్పు పెట్టి కాల్చివేస్తున్నది. చెత్తలో ఖాళీ సీసాలు, టైర్లు ఉండటంతో నిప్పు అంటుకుని పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో సూర్యకళ గాయపడింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న దవాఖానకు తరలించి, మెరుగైన చికిత్స కోసం వనస్థలిపురంలోని కంటి దవాఖానకు తరలించారు. సూర్యకళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని సీఐ తెలిపారు. పేలుడు సంభవించిన స్థలాన్ని క్లూస్‌టీం, బాంబ్ స్వాడ్ సిబ్బంది తనిఖీ చేశారు.