calender_icon.png 6 January, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాణాసంచా యూనిట్‌లో పేలుడు: ఆరుగురు మృతి

04-01-2025 12:31:29 PM

విరుదునగర్: తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం విరుదునగర్ జిల్లా సత్తూరు ప్రాంతంలో శనివారం బాణాసంచా తయారీ యూనిట్‌(Firecracker Manufacturing Unit)లో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. విరుదునగర్ జిల్లా సత్తూరు ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించిందని ఫైర్, రెస్క్యూ విభాగం అధికారులు మీడియాకు తెలిపారు. విరుదునగర్‌లోని సత్తూరులోని బాణాసంచా కర్మాగారంలో క్రాకర్స్(Cracker) తయారీలో కార్మికులు నిమగ్నమై ఉండగా పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు. కాగా, మృతుల గుర్తింపును పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. తొలుత ముగ్గురి మృతదేహాలను వెలికితీసిన పోలీసులు ఆ తర్వాత మృతుల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,