calender_icon.png 20 April, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల అన్వేషణ

06-04-2025 10:50:41 PM

ఏజెన్సీలోని గ్రామాలను సందర్శించిన సిపిఎం పార్టి మండల కమిటీ..

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గిరిజన గ్రామాలను సందర్శించి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పార్టీ బృందం ఆరా తీస్తోంది. ఆదివారం ఆ బృందం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేస్తుంది. అనేక గ్రామాల్లో మంచినీళ్లు సమస్య వుందని, ముఖ్యంగా బట్టి గూడం గ్రామంలో మంచినీరు అందక ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు.

ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇబ్బంది వున్న ఎంతో మంది అధికారులకు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మొరపెట్టుకున్నారు, తక్షణమే అధికారులు స్పందించి ఆ గ్రామంలో ఉన్న మంచి నీటి సమస్య తీర్చకపోతే ఈ సమస్య పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చ రామారావు హెచ్చరించారు, చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వివరించడంపై వారు మండిపడ్డారు.

తక్షణమే గ్రామంలో  మినీట్యాంకు ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చ రామారావు డిమాండ్ చేశారు. గ్రామాల్లో డ్రైనేజీ సమస్య రోడ్ల సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తక్షణమే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ తాటి నాగమణి గ్రామ శాఖ సెక్రెటరీ సీతయ్య, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.