- పల్లెల్లో కార్మికుల కోసం హెల్త్ క్యాంపులు
- ఒక్కో కార్మికుడికి 22 రకాల పరీక్షలు
- సీఎస్‌సీ హెల్త్ కేర్‌కు రూ.3,256 చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- కార్మికులకు అందని రిపోర్టులు
- పంచాయతీ ఆఫీసుల్లోనే రెండేళ్లుగా రిపోర్టులు
సిరిసిల్ల, జనవరి 6 (విజయక్రాంతి): కార్మికుల శ్రమను దోచుకోవడమే కాకుండా వారికి ఆరోగ్య పరీక్షల పేరిట ప్రభుత్వం నుం వచ్చే నిధులను దోచుకుంటున్నారు. కార్మికుల అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఆరోగ్య పరీక్షల నిర్వహణ ప్రథమంగా ఉన్నది.
ఆరోగ్య పరీక్షలు చేసి, వారి హెల్త్ ప్రొఫైల్ అందించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఊరురా కార్మికులకు వైద్య పరీక్షలు చేసి, వచ్చిన రిపోర్టులను కార్మికులకు అందిస్తే, వాటి ఆధారంగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటారు.
కానీ సిరిసిల్ల జిల్లాలో మాత్రం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, కార్మికుల నుంచి రక్త నమూనాలు సేకరించి రిపోర్టులు ఇవ్వకుండా పంచాయతీ కార్యాలయాల్లోనే పడేసి వెళ్తున్నారు. రెండు సంవత్స రిపోర్టులు అక్కడే పడి ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
అర్హత లేని సిబ్బందితో పరీక్షలు
ప్రతి కార్మికుడికి 22 రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు చేసినందుకు సీఎస్‌సీ హెల్త్ కేర్ సంస్థకు ప్రభుత్వం రూ.3,256 చెల్లిస్తుంది. వైద్యుడి సమక్షంలో పరీక్షలు చేయాల్సి ఉండగా అర్హత లేని ఇద్దరు సిబ్బందితో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఆ రిపోర్టులతో కార్మి ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వివరించేందుకు వైద్యుడు ఉండడు. ఒక వేళ ఆ రిపోర్టును పట్టుకుని ఇతర వైద్యుల వద్దకు వెళ్తే ఈ రిపోర్టు చెల్లదని, తిరిగి పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. సంస్థ ఇచ్చే రిపోర్టు ఆధారంగా మందులు తెచ్చుకునే పరిస్థితి కూడా కనిపించ లేదు.
కానీ పరీక్షలు చేసినట్లు చూపిస్తున్న సంస్థకు మాత్రం లాభం చేకురూతుంది. అంతేకాకుండా లేబర్ కార్డు లేకున్నా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు కార్మికుడిగా చూపిస్తూ, పరీక్షలు చేసినట్లు ప్రభుత్వ నిధులు కాజేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తం రూ.కోట్లలో వ్యాపారం సాగుతోంది.
సిరిసిల్ల జిల్లాలో 66వేల లేబర్ కార్డులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు, 260 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 66 వేల వరకు కార్మికశాఖ జారీ చేసిన లేబరు కార్డులు ఉన్నాయి. వీరికి 22 రకాల ఆరోగ్య పరీక్షలు చేసేందుకు సీఎస్‌సీ హెల్త్ కేర్ సంస్థ ఒప్పందం చేసుకున్నది. ప్రతి పంచాయతీ కార్యాలయం వద్ద హెల్త్ చెకప్ క్యాంపులు ఏర్పాటు చేసి, లేబర్ కార్డులు ఉన్న వారి రక్త నమూనాలు సేకరిస్తారు.
లేబర్ కార్డు నంబర్‌తో పాటు ఆధార్ కార్డు నంబరు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తారు. రక్త నమూనాలు సేకరించిన తర్వాత వారం రోజుల్లో వచ్చి రిపోర్టులు సంబధిత కార్మికుడికి ఇవ్వకుండా పంచాయతీ కార్యాలయంలో పడేసి వెళ్తున్నారు.
పరీక్షలు ఏమిలో తెలియదు
ఏమి పరీక్షలు చేసిం మాకు తెలియదు. గ్రామ పంచా వద్ద పరీక్షలు చేసి, రిపోర్టులు ఇంటికి తీసుకు చెప్పిండ్రు. ఇప్పటి వరకు రిపోర్టు రాలేదు. తెలిసిన వాళ్లను అడిగితే పంచాయతీ కార్యాలయంలో ఉంటాయన్నారు. అయినక రిపోర్టులు రాలేదు.
సాట్ల రేణుక, కార్మికురాలు, కోనరావుపేట
పరీక్షలు చేసి, రిపోర్టులు ఇయ్యలేదు
పరీక్షలు చేసి పది నెలలు అవుతున్నా రిపోర్టులు రాలేదు. గ్రామ పంచాయతీ కాడికి రమ్మని రక్త నమూనాలు తీసుకున్నారు. అన్ని పరీక్షలు చేస్తామని చెప్పి, ఇప్పటి వరకు రిపోర్టులు రాలేదు. అసలు ఎందుకు పరీక్షలు చేసిండ్రో, చేసిన పరీక్షల రిపోర్టులు ఎందుకు ఇయ్యలేదో తెలియదు.
చీకోటీ మానస, కార్మికురాలు, కోనరావుపేట
పరీక్షలు చేసినందుకు ప్రభుత్వం
అందించే బిల్లుల వివరాలు
టెస్టు ఫీజు రూ.లలో
డాక్టరు 135
లంగ్ ఫంక్షనింగ్ -425
ఆడియో స్క్రీనింగ్ 115
విజన్ స్క్రీనింగ్ -32
సీబీసీ టెస్ట్ 122
బ్లడ్ షుగర్ -21
లివర్ ఫంక్షనింగ్ 213
కిడ్ని ఫంక్షన్ -203
లిపిడ్ ప్రోఫైట్ -183
యూరిన్ 33
ఈసీఆర్- 25
టీ3 టీ4 టీఎస్‌హెచ్ -181
జీజీటీపీ 81
హెచ్‌ఐవీ 150
హెపాటీటీస్ బీ- 102
హెపాటీటీస్ సీ- 128
వీడిఆర్‌ఎల్ 43
బ్లడ్ గ్రూపింగ్ 28
వీటమిన్ డీ 3,-550
హెచ్‌బీఎ 1 సీ- 130
ఈసీజీ- 50
సీఈఏ- 306