calender_icon.png 4 April, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేలిన గ్యాస్ సిలిండర్.. లక్ష ఆస్తినష్టం

02-04-2025 01:04:16 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 1 (విజయక్రాంతి):  ప్రమాదవశాత్తు ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో రూ.లక్ష ఆస్తినష్టం జరిగిన సంఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో సమబావన సంఘం వీబీకే గా పనిచేస్తున్న శిగ యాదమ్మ ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది.దీంతో బయటకు పరుగులు తీశారు.ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోగా,రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు,ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత మహిళ వాపోయింది.