calender_icon.png 24 December, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టీల్ ఫ్యాక్టరీలో పేలిన బట్టీ

04-08-2024 12:05:32 AM

పలువురికి గాయాలు

 పరిగి, ఆగస్టు 3 (విజయక్రాంతి): పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి శివారులోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బట్టీ పేలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో శనివారం సాయం త్రం ప్రమాదవశాత్తు ఫర్నస్ బట్టీ పెద్ద శబ్దంతో పేలింది. దీంతో ఫ్యాక్టరీ నుంచి పెద్దఎత్తున పొగలు వచ్చాయి. ఘటనలో పలువురు గాయపడగా.. యాజమాన్యం వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయాన్ని కప్పి ఉంచేందుకు యాజమాన్యం యత్నిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.