భారీగా ఎగిసిపడిన మంటలు
రాజేంద్రనగర్, నవంబర్16: మణికొండ మున్సిపల్ పరిధిలోని పుప్పాల గూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జామున బీఆర్సీ ఎదురుగా ఉన్న గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ ఏధూd1 బ్లాక్‌లోని ఐదో అంతస్తు నుంచి మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని లేదా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో అపార్ట్‌మెంట్‌వాసులు తీవ్ర భయాం దోళన చెందారు. ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అపార్ట్మెంట్లోకి ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి. దీంతో పక్క అపార్ట్మెంట్ దగ్గరి నుంచి మూడు ఫైరిజన్లు చాలాసేపు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.50లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.