- ఆ సమయంలో 30 మంది విద్యార్థులు
- స్థానికుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
కామారెడ్డి, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): 30 మంది విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సులో బ్యాటరీ పేలడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. దట్ట బైన పొగులు వ్యాపించడంతో ఏమి జరుగుతుందో తెలియక రోదించారు. ఈ ఘటన కా మారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఉద యం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సు ను ఆపి, స్థానికుల సహాయంతో విద్యార్థుల ను కిందికి దించారు. అయినా భయంతో వి ద్యార్థులు రోధిస్తూ పరుగులు తీశారు. స్కూ ల్ బస్సు బ్యాటరీ పేలడంపై విద్యార్థుల తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు క ండిషన్ చూసుకోకుండా నడిపిస్తే ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు