calender_icon.png 28 December, 2024 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ పాఠశాల బస్సులో పేలిన బ్యాటరీ

18-09-2024 12:11:52 PM

భారీగా పొగలు విద్యార్థుల అర్ధనాదాలు

బస్సులో 30 మంది విద్యార్థులు

స్థానికుల అప్రమత్తతో బయటపడ్డ విద్యార్థులు

కామారెడ్డి జిల్లాలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ఊపిరి పీల్చుకున్న ప్రైవేట్ పాఠశాల యజమాన్యం

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ప్రైవేట్ స్కూల్ బస్సు 30 మంది విద్యార్థులతో పాఠశాలకు వస్తుండగా బస్సులోని బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు బస్సులో వ్యాపించాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతూ రోదించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో బస్సును ఆపి విద్యార్థులను కిందికి దించేందుకు స్థానికులు కూడా చేయి కలపడంతో విద్యార్థులు రోదిస్తూ బస్సు నుంచి బయటకు పరుగులు పెట్టారు. బస్సులో పొగలు రాకుండా అగ్నిప్రమాదమే జరిగితే పిల్లలు దుర్మరణం పాలయ్యేవారు.

ప్రైవేట్ స్కూల్ బస్సు బ్యాటరీ పేలడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు కండిషన్ చూసుకోకుండా నడిపిస్తే ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అప్రమత్తంగా వివరించడంతో బస్సులోని పిల్లలందరినీ దించి వేశారు. ఘోర ప్రమాదం నుంచి విద్యార్థులు బయటపడడంతో పాఠశాల యజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.