calender_icon.png 15 November, 2024 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమాన్ని వివరించాలి

15-11-2024 12:41:17 AM

  1. వరంగల్, కరీంనగర్, పాలమూరు జిల్లాల్లో బహిరంగ సభలు
  2. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, సచివాలయంలో వేడుకలు
  3. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
  4. ప్రజాపాలన విజయోత్సవాలపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 14 (విజయ క్రాంతి) : ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజాపాలనొోవిజయోత్సవాల నిర్వహణపై గురువారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు. విజయోత్స వాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు.

మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్ మెంట్‌కు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ఈనెల 19న వరంగల్‌లో జరిగే విజయోత్సవ సభ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

భాగ్యనగరంలో మూడు రోజులు

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సెక్రటేరి యట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని.. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రజాపాలన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

డిసెంబర్ 9న సెక్రటేరియట్ ఆవరణలో ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా,, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు. శాఖలు, విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.