calender_icon.png 22 April, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరించాలి

22-04-2025 02:06:24 AM

- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

- వివిధ ప్రాంతాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహణ  

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 21: కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ఇంటింటికి తిరిగి వివరించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని హిమాయత్ సాగర్, మణికొండ మున్సిపల్ పరిధిలోని నేక్నంపూర్, అదేవిధంగా నార్సింగి మున్సిపల్ పరిధిలోని వట్టినాగులపల్లి, మైలార్దేవ్ పల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు,  జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ముందుగా ఆయా ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ర్యాలీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృ షిని అందరికీ వివరించాలన్నారు. అదేవిధంగా పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషిని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.