ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాం తి): ఉస్మానియా ఆస్పత్రి తరలింపునకు సం బంధించిన వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఆస్పత్రి తరలింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరిం చింది. ఈ మేరకు పిటిషనర్ న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.
రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి వీలుగా ఉస్మానియా ఆస్పత్రిని తరలించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఈ విషయంలో తమ జోక్యానికి ఆస్కారం తక్కువని చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేస్తూ జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో పోలీసు స్టేడియానికి తరలించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గౌలిగూడకు చెందిన ఆనంద్ గౌడ్ పిటిషన్ వేశారు. పిటిషినర్ న్యాయవాది వాదిస్తూ దవాఖానను తరలిస్తే ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం అధునాతన వసతులతో కొత్త ఆస్పత్రి భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.