calender_icon.png 16 January, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 3పై వివరణ ఇవ్వండి

19-07-2024 01:29:35 AM

ఇసుక లోడింగ్‌లో మనుషులను ఎందుకు వినియోగించడం లేదు?

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ట్రక్కుల్లో ఇసుక నింపడానికి మనుషులను వినియోగించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌం టర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 4 వారాలకు వాయిదా వేసింది. గోదావరిలో ఇసుక ను నింపేందుకు మనుషులను మాత్రమే వినియోగించాలని తద్వారా వారికి ఉపాధి అందుతుందని ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో జీవో 3ని తీసుకొచ్చింది.

అయితే అధికారులు ఈ జీవోను పట్టించుకోవడం లేదని, తాను ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా పరిశీలించడం లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామానికి చెందిన భిక్షపతి పిటిషన్ దాఖలు చేశారు. గోదావరి నదిలోని ఇసుక రీచ్‌ల్లో పనిచేస్తున్న 13 క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీల అధ్యక్షులు భారీ యంత్రాలను మోహరించి ఇసుకను ట్రక్కుల్లో నింపుతున్నారని తెలిపారు. అంతేకాకుండా మాన్యువల్ చార్జీలుగా భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. ఈ కారణంగా గిరిజనులకు ఉపాధి కరువవుతోందని, మనుషులను వినియోగించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.