calender_icon.png 15 March, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోర్ సూపర్ మార్కెట్ నిర్వాకం.!

15-03-2025 03:02:16 PM

- కాలం చెల్లిన జ్యూస్ అమ్మకాలు.

- ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మోర్ సూపర్ మార్కెట్లో(More Supermarket) కాలం చెల్లిన జ్యూస్ ఇతర వస్తువులను వినియోగదారులకు అంటగడుతున్నారు. గ తేడాది ఆగస్టు 23న తయారీ జరిగిన జ్యూస్ ఈ ఏడాది ఫిబ్రవరి 19 వరకే చివరి తేదీ ఉన్నప్పటికీ సూపర్ మార్కెట్లోని సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి వాటిని అమ్మకానికి పెట్టారు. నమ్మకంతో శనివారం ఓ వినియోగదారుడు కొనుగోలు చేసి తమ పిల్లలకు ఇవ్వడంతో వాటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. చిన్నపిల్లలు తాగే జ్యూస్ లను సుమారు నెలల తరబడి కాలం చెల్లిన వాటిని ఎలా అమ్ముతారని ప్రశ్నించడంతో స్టోర్ మేనేజర్ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అడ్డగోలుగా ధరలు నిర్ణయించడంతోపాటు జిల్లా లోని సూపర్ మార్కెట్లో ఇతర వస్తువులు సైతం కాలం చెల్లిన సామాన్లను అంటగడుతున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు.