మార్చి వరకు పొడిగింపు
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ మంగళవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చొప్పున జనవరి 1 నుంచి మార్చి 31 వరకు కార్డులు మనుగడలో ఉంటాయని స్పష్టం చేశారు.
ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ యాజమాన్యాలకు సమాచారం అందించామన్నారు. ఈ నెల 31తో అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగియనుండగా, పలు కారణాలతో ఈ గడువును మూడు నెలలు పొడిగించామన్నారు.