06-04-2025 12:00:00 AM
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం తినే ఆహారంలో డ్రైఫ్రూట్స్, తాజా పం డ్లు, కూరగాయలు భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తారు. ఇవి తినడం వల్ల పోషకాలు మరిన్ని శరీరానికి అందుతాయి. అయితే వీటిని కూడా ఒక పరిమితి ప్రకారం తినాలని, మరీ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మనం పండ్లను తినాలనుకుంటే అరటిపండు, సీతాఫలం, యాపిల్, పియర్ వంటివి రోజుకి ఒకటి తింటే సరిపోతుంది. బొప్పాయి, కర్బూజ అయితే సగం కప్పు ముక్కలు తింటే సరిపోతుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయంలో పండ్లను జ్యూస్‌గా చేసి తాగడం కంటే నేరుగా తినడమే మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలా అని రోజులో మరీ ఎక్కువ వద్దని సూచిస్తున్నారు.
రెండు అంజీరా.. బాదం, జీడిపప్పు, పిస్తాలను నాలుగు చొప్పున రోజూ తీసుకుంటే చాలు. ఇవి మొత్తం 30 గ్రాములు లోపు ఉంటే సరిపోతుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి మధ్య వీటిని తీసుకుంటే నీరసం రాదు. ఇతర చిరుతిళ్లు తినాలని అనిపించదు.