టెట్ మార్కుల అప్‌లోడింగ్‌కు అవకాశం
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): డీఎస్సీ ఫైనల్ కీ లో దొర్లిన తప్పులపై అధికారులు పునఃపరిశీలించనున్నారు. దీనిపై నిపుణుల కమిటీ మరోసారి సమావేశమై పరిశీలించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. డీఎస్సీ ఫైనల్ కీ లోనూ చాలా వరకు తప్పులు దొర్లినట్లు పలువురు అభ్యర్థులు ఆధారాలతో సహా సోమవారం అధికారులకు అభ్యంతరాలు సమర్పించారు. ఈ అభ్యంతరాలపై నిపుణుల కమిటీ సమావేశమై, నిజానిజాలను తేల్చనుంది. ఒకవేళ తప్పులు దొర్లినట్లు గుర్తిస్తే రివైజ్డ్ కీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఫైనల్ కీ నే పరిగణనలోకి తీసుకుంటారు. ఇదిలా ఉంటే దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలా మంది అభ్యర్థులు తమ టెట్ మార్కుల వివరాలను అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయలేదు. దీంతో టెట్ మార్కులను అప్‌లోడ్ చేసుకునేందుకు అధికారులు మరోసారి అవకాశం కల్పించనున్నారు.