calender_icon.png 20 April, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయోగాత్మక ప్రేమకథలు.. కత్తిమీద సాము

16-04-2025 10:22:20 PM

ఉదయ్‌రాజ్, వైష్ణవి సింగ్ జంటగా దర్శకుడు రాజేశ్ చికిలే తెరకెక్కిస్తున్న చిత్రం ‘మధురం’. ఎం బంగార్రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడమే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సైతం నిర్వహించారు. మొదట స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్‌తో ట్రైలర్‌ను విడుదల చేయిం చారు. అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడు తూ “మధురం’ ట్రైలర్‌లో టీనేజ్ లవ్‌స్టోరీ చూడగానే నా ఫ్లాష్‌బ్యాక్ గుర్తొచ్చింది.

ఇలాంటి ప్రయోగాత్మక ప్రేమకథలు రూపొందించడం కత్తిమీద సాములాంటిది” అని తెలి పారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని హీరో ఉదయ్‌రాజ్ చెప్పారు. ‘ఇదొక యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది’ అని హీరోయిన్ వైష్ణవి సింగ్ తెలిపారు. ‘ఈ కథను ఎంత బాగా రాసుకున్నానో.. అంతే చక్కని టీమ్ కుదిరింది” అని చిత్ర దర్శకుడు రాజేశ్ చికిలే అన్నారు. ‘ఈ చిత్రం చాలా మధురంగా ఉంటుంది. నేను కొత్త నిర్మాతనైనా అందరూ సపోర్ట్ చేశారు’ అని నిర్మాత బంగార్రాజు తెలిపారు. రఘు కుంచె, డైరెక్టర్ విజయ్‌కుమార్ కొండా, చిత్రబృందం కార్యక్రమంలో పాల్గొన్నారు.