జనవరిలో పనులు ప్రారంభం
హైదరాబాద్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో ఫేస్-2 కారిడార్ VI ఎంజిబిఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు 200 ఆస్తులుకు (100 LHS, 100 RHS) డిక్లరేషన్ శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి ఆమోదించారు. వాటికి అనుగుణంగా డిసెంబర్ నెల ఆఖరిలో ఆమోదించడం జరుగుతుంది. కొత్త సంవత్సరం జనవరి నెలలో మెట్రో రైలు పనులు ప్రారంభమైతాయని తెలిపారు.