26-02-2025 12:05:59 AM
పదిరోజుల్లో మంచినీటి పైపులైన్ పూర్తిచేయాలి
సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి
హుస్నాబాద్, ఫిబ్రవరి 25 : మెదక్ నుంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మీదుగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే పనులను స్పీడప్ చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన హుస్నాబాద్ లో రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీ, ఇతర పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైవే పనుల ఆలస్యానికి కారణాలు అడిగారు. రోడ్డు వెంబడి నిర్మిస్తున్న డ్రింకింగ్ వాటర్ పైపులైన్ పనులను కూడా పరిశీలించారు. జిల్లాలో హైవే పనులను స్పీడప్ చేయడంతోపాటు హుస్నాబాద్ లో మంచినీటి పైపులైన్ పనులను పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
మెడికల్ కాలేజీ కోసం స్థల పరిశీలన..
అనంతరం కలెక్టర్ హుస్నాబాద్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం జిల్లెలగడ్డలో స్థలాన్ని పరిశీలించారు. ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి స్థలానికి సంబంధించిన వివరాలను అందించారు. అనంతరం కలెక్టర్ మహిళాశక్తి భవనం కోసం ఉమ్మాపూర్ లో స్థలాన్ని పరిశీలించారు.