అదే పనిగా కురుస్తున్న వానలతో.. వాతావరణం చల్లబడి, శ్వాసకోశ సమస్యలు మొదలవుతున్నాయి. అయితే ఈ సమస్యల కు లవంగ టీతో అడ్డుకట్ట వేయవచ్చు. నోట్లోని బ్యాక్టీరియాను చంపడంతో పాటు, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని కరిగించి, బయటకు వచ్చేలా చేసే గుణం లవంగాలకు ఉంటుంది. లవంగాలు రోగనిరోధకశక్తిని బలపరుస్తాయి కూడా! దగ్గు, జలుబు, ఛాతీలో ఇబ్బంది లాంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు లవంగ టీ తీసుకోవచ్చు. లవంగ టీ ఎలా తయారు చేసుకో వాలో చూద్దాం..
తయారీ: చిన్న అల్లం ముక్క, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, సగం చెంచా లవంగాలను మూడు కప్పుల నీళ్లతో పాటు మరిగిం చాలి. తర్వాత నీళ్లను వడగట్టి, చల్లారనివ్వాలి. తర్వాత ప్రతి రెండు గంటలకోసారి అరకప్పు లవంగ టీలో సగం చెంచా తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి.