సొమ్ము కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): తాము సూచించిన స్టాక్స్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తా యని ఆశచూపి సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన నగరంలో వెలుగు చూసింది. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 49 మంది సభ్యులు గల ‘వీఐపీ 101 ఏబీఎంఎల స్టాక్ స్టార్టజీ గ్రూప్’ పేరిట గల వాట్సప్ గ్రూప్‌లో ఒక వ్యక్తికి మెసేజ్ వచ్చింది. తాము చెప్పిన పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్ (ఏబీఎంఎల్) పేరిట ఆ నేరగాళ్ల నియంత్రణలోని బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని కోరగా.. అది గమనిం చకుండా బాధితుడు దాదాపు.
రూ.28.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అనంతరం నేర గాళ్లు బాధితుడిని బెదిరించి తమ ప్లాట్ ఫాం లో లోన్ తీసుకోవాలని ఒత్తిడి చేశారు. బాధితుడి భార్య ఏబీఎంఎల్ ఖాతా నుంచి కూడా రూ.61.66 లక్షలను కాజేవారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన బాధితు డు సైబర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.