calender_icon.png 7 November, 2024 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయ విస్తరణ చేపట్టాలె

31-08-2024 12:33:27 AM

అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సీఎంను కలిసిన  ఆలయ అర్చకులు, అధికారులు

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ విస్తరణకు సంబంధించిన అనుమతులు తీసుకొని పనులను చేపట్టాల్సిందిగా  అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం 50 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయ విస్తరణ ప్రణాళికలు, నమూనాపై శృంగేరి పీఠం అనుమతి తీసుకోవలసి ఉందని అర్చకులు వివరించారు. వెంటనే అనుమతి తీసుకుని, ఇందుకు సంబంధించిన పనులను చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. సీఎంను కలిసిన వారిలో రాజన్న ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేశ్, డీఈఈ రఘునందన్, ప్రధాన అర్చకులు ఉమేశ్ శర్మ ఉన్నారు.